ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్
పి.ప్రావీణ్య బుధవారం పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి రానున్న ధాన్యం వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గ్రేయిన్ క్యాలిపర్ యంత్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి కలెక్టర్ పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఉమారాణి, డిఆర్డివో నాగ పద్మజ, తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో బాబు, సివిల్ సప్లై డీటీలు నాగేంద్ర ప్రసాద్, రమేష్, ఇతర అధికారులతో పాటు రైతులు పాల్గొన్నారు.