ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబురాలు.. తొమ్మిది రోజుల పాటు కనుల పండువగా జరగనున్నాయి. మహిళలు ఊరూరా ఎంగిలిపూల బతుకమ్మలను పేర్చి, వేడుకలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం తీరొక్క బతుకమ్మలతో ఆయా గ్రామాల్లోని గుళ్లు, చెరువుల వద్దకు చేరుకుని ఆడిపాడారు.
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’, ‘ఒక్కేసి పువ్వేసి చందమామ..’ అంటూ బతుకమ్మ పాటలతో సందడి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. ఎంగిల పూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభమై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.
ఓరుగల్లులో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ప్రత్యక్ష ప్రసారం
https://www.youtube.com/live/tECLyFDF_YI?si=tnZV7Um7y9mELXQ
ORUGALLU9NATIONAL TV LIVE-9TV
హనుమకొండలోని వేయి స్తంభాల గుడి వద్ద మహిళలు బతుకమ్మలతో వచ్చి ఒక చోట చేరారు. ఈ వేడుకల్లో ఎంపీ కడియం కావ్య, మంత్రి కొండా సురేఖ ,మేయర్ గుండు సుధారాణి ,కార్పొరేటర్స్, అడ్లూరి రోజారాణి,మరుపట్ల ప్రమీల ,యాంకర్ రమ్యశ్రీ,అడ్లూరి రమ్యశ్రీ ,జోక్కుల మంజుల, సుష్మ ,అపర్ణ ,సవిత,రజిని…తదితరులు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు వైభవంగా ఆడుతూ జరుపుకున్నారు.