Monday, December 23, 2024

స్టార్ల కోసం సార్ల పరుగులు

జిల్లాలో గాడి తప్పిన విద్యావ్యవస్థ…!

వెలుగునిచ్చే పంతుళ్లు చీకటిలో….!

అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు..?

అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు..?

బిట్ కాయిన్ ఎఫెక్ట్… జిల్లాలో విద్యా వ్యవస్థ అతలాకుతలం…

అరెస్టులను అడ్డుకోవడానికి ఓ బడానాయకుడితో బేర సారాలు….

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29:

బిట్ కాయిన్ భూతం జిల్లాలో విద్యావ్యవస్థను మింగేసిందా అంటే అవుననే చెప్పవచ్చు.. సాధారణ ప్రజల నుండి విద్యావంతుల వరకు ప్రతినిత్యం ఉపాధ్యాయులు బిట్ కాయిన్ పై చర్చిస్తున్నారు. ఈరోజు ఎంతమంది ఉపాధ్యాయులు అరెస్టు అయ్యారు… మిగిలినవారు ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారు. అనే చర్చ జోరుగా సాగుతుంది. సోషల్ మీడియాలో సైతం జిల్లా విద్యా వ్యవస్థపై ప్రజలు గుర్రుమంటున్నారు. రెండు దఫాలుగా మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు బిట్ కాయిన్ అక్రమ వ్యాపారం చేసి కటకటాల పాలయ్యారు. విద్యార్థులకు వెలుగునిచ్చే ఉపాధ్యాయులు చీకటి గదిలోకి వెళ్లిపోయారు. పెద్ద పెద్ద చదువులు చదివి, పోటీని తట్టుకొని ఉపాధ్యాయులుగా ఎంపికైన కొందరు అత్యాశతో బిట్ కాయిన్ వ్యాపారం లోకి అడుగుపెట్టి విద్యార్థుల భవిష్యత్తును అంధకారం లోకి నెట్టారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు సర్కారు బడిలో చదువుతుంటారు. వారికి విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులే అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలనే అత్యాశతో విద్యాబుద్ధులు నేర్పకుండా బిట్ కాయిన్ వెంటపడి, స్టార్లు అవుదామనేఉద్దేశంతో జీరో లు అయిపోయారు. ఐదుగురు ఉపాధ్యాయులు అరెస్టు అవడం, మిగతా సుమారు 50 మంది ఉపాధ్యాయులు బిట్ కాయిన్ వ్యాపారంలో ఉంటూ ఎప్పుడు తమ వంతు వస్తుందో అని టెన్షన్ తో విద్యార్థులకు పాఠాలు నేర్పకుండా బేరసారాలకు దిగుతున్నట్లు సమాచారం. ఎప్పుడు ఏ వైపు నుండి పిడుగు పడుతుందో అని భయపడుతూ ఉపాధ్యాయులు జీవితాన్ని గడుపుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు అరెస్టులను తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వినికిడి. దీంతో విద్యా సంవత్సరం విద్యార్థులు చదువులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వెలుగునిచ్చే పంతులు చీకటిలో…!

వేళల్లో జీతాన్ని గాలికి వదిలేసి కోట్లల్లో వచ్చే ఆదాయానికి కక్కుర్తి పడి దురాశతో జిల్లాలోని పలు ఉపాధ్యాయులు బిట్ కాయిన్ వ్యాపారం లోకి అడుగుపెట్టి చీకట్లోకి వెళ్లిపోయారు. దురాశ దుఃఖానికి చేటు అన్న చందం అర్థం కాక ఉపాధ్యాయులు తమ ధర్మాన్ని వదిలి అధర్మం వైపు నడిచి చీకట్లోకి వెళ్లిపోయారని, వెలుగునిచ్చే ఉపాధ్యాయులు చీకట్లోకి వెళ్లిపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి మారిపోయిందని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. స్టార్ల వెంట పడ్డ సార్లు విద్యార్థుల చదువును గాలికి వదిలేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి లగ్జరీ జీవితానికి అలవాటు పడడంతో జిల్లాలో ఈ దుస్థితి దాపురించింది అని పలువురు విమర్శిస్తున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు అరెస్టు అవడం, మిగతా ఉపాధ్యాయులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో వెలుగు నిచ్చే పాఠశాలలు అగాధంలోకి కూరుకుపోయాయి.

అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు

బిట్ కాయిన్ వ్యాపారంలో ఉపాధ్యాయులు అరెస్టు కావడం, పలువురు ఉపాధ్యాయులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడానికి, చదువు చెప్పడానికి ఉపాధ్యాయుల కొరత ఏర్పడడంతో పలువురు తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సంవత్సరం తమ పిల్లలు ఉత్తీర్ణత సాధిస్తారో లేదో అని భయాందోళనలకు లోన్ అవుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు పంపిద్దామంటే డబ్బులు సరిపోక ప్రభుత్వ పాఠశాలలకు పంపితే వేలల్లో జీతాలు పొందుతున్న ఉపాధ్యాయులు కక్కుర్తి పడి కటకటాల పాలవడంతో దిక్కుతోచని స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. లోపబుయిష్టమైన జిల్లా విద్యాశాఖ తీరు వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

అరెస్టులను అడ్డుకోవడానికి ఓ బడానాయకుడితో బేరసారాలు…?

క్రిప్టో కాయిన్, బిట్ కాయిన్ అక్రమ వ్యాపారంలో సెవెన్ స్టార్, సిక్స్ స్టార్, ఫైవ్ స్టార్ ఇలా వన్ స్టార్ వరకు పలువురు ఉపాధ్యాయులు చేరుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం కొన్ని స్టార్ల ఉపాధ్యాయులు అరెస్టు అయ్యారు. సూపర్ స్టార్లు మాత్రం ఇంకా అరెస్టు అవ్వకపోవడంతో తమను అరెస్టు చేయకుండా ఉండేందుకు జిల్లాలోని ఓ బడ నాయకుడితో బేరసారాలను కుదుర్చుకున్నట్లు సమాచారం. కేసులో నుండి బయటపడేందుకు ప్రతి ప్రతిరోజు నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమపై కేసులు లేకుండా చూసుకునేందుకు ఒక్కో ఉపాధ్యాయుడు ఓ బడా నాయకుడికి 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే అరెస్టుల పర్వం తాబేలు పరుగుల ఉందని జిల్లాలోని పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి సి బి సి ఐ డి కి ఆదేశించాలని, అక్రమ వ్యాపారంలో పాత్రుడైన ప్రతి ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular