అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసంలో ఆహార పదార్థాల ప్రదర్శన
నర్సాపూర్ జి : నర్సాపూర్ జి మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మూడు అంగన్వాడీ కేంద్రాలు కలిసి రాంపూర్ 2వ అంగన్ వాడీ కేంద్రంలో పోషణ మాసంలో భాగమైన పోషక ఆహార ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీ విశారద మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, తల్లులకు. కిశోర బాలిక పిల్లలు తీసుకోవలసిన స్థానికంగా చవకగా దోరికే అహార పదార్థాల గురించి వివరించారు. బిడ్డ జీవితంలో వచ్చే మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సూచించారు. ప్రిస్కూ కొత్త విద్య ప్రణాళిక గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ లక్ష్మి విశారద, పంచాయతీ కార్యదర్శి నవనీత్ కుమార్, స్కూల్ టీచర్ రాజేశ్వరి, అంగన్వాడి టీచర్లు గోదావరి, స్వర్ణలత, లక్ష్మి, ఆశాలు గంగాజల, సంగీత, తల్లులు,గర్భిణీ బాలింతలు, పిల్లలు హాజరయ్యారు.
తల్లులకు సూచనలు ఇస్తూన ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి విశారద