ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి న్యూఢిల్లీ : ఈ లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ప్రవేశపెట్టిన ‘ఇంటి వద్ద ఓటు’కు మంచి స్పందన వచ్చిందని ఎలక్షన్కమిషన్ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల చివరి దశలలో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్లు, గిరిజన ఓటర్లలో ఎంతో ఉత్సాహం కనిపించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో తొలిసారిగా దేశంలో 85 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లు, 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయాన్ని దేశ వ్యాప్తంగా కల్పించినట్టు ఈసీ పేర్కొంది. దీంతో సంబంధిత ఓటర్ల నుంచి ఉత్సాహభరితమైన స్పందన వచ్చిందని పోల్ ప్యానెల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ, ఎన్నికల ప్రక్రియలలో నిరంతర అభివృద్ధి కోసం కృషి చేయాలనేది కమిషన్ సంకల్పమని, దేశానికి గర్వకారణమైన బహుళత్వం, భిన్నత్వం స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కృతనిశ్చయంతో ఉందని రాజీవ్ కుమార్ చెప్పారు.
ఇంటి వద్ద ఓటుకు మంచి స్పందన.-ఎలక్షన్కమిషన్ -ఓరుగల్లు9నేషనల్ టివి
RELATED ARTICLES