రాజన్న జిల్లా: పువ్వు పుట్టగానే పరమ ళిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది.అమ్మ అని పలకడం కూడా రాని చిట్టి వయసులో 70కి పైగా వస్తువులను గుర్తించి అందరి ప్రశంసలు అందు కోవడమే గాక, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు చోటు కూడా సంపాదించింది ఆ చిన్నారి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వేముల సాగర్-సౌమ్య ల కూతురు సంవేద్యకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది.అమ్మానాన్నలను గుర్తించడమే కష్టమైన వయసులో 70కి పైగా కేటగిరీలలో వస్తువులను గుర్తించడం ద్వారా సంవేద్య తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులను ఆకట్టుకుంది.
చిన్నారి ప్రతిభకు అబ్బుర పడిన ప్రతినిధులు బంగారు పతకంతో సన్మానించడమే కాకుండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేశారు. పాప రంగులను గుర్తించడం చూసి వివిధ రకాల కేటగిరీలో వస్తువు లను చూపించడం ద్వారా వాటిని గుర్తించేలా ప్రాక్టీస్ చేయించామని తల్లిదండ్రులు తెలిపారు.
తమ చిన్నారి పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
5 నెలలకే తెలుగు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్-ఓరుగల్లు9నేషనల్ టీవీ5 నెలలకే తెలుగు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్-
RELATED ARTICLES