Tuesday, December 24, 2024

రోడ్ షో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి

ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి:. సంగెం మండల కేంద్రంలో పరకాల నియోజకవర్గం బిజెపి పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు రోడ్ షో మరియు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కి సంగెం మండల కేంద్రానికి ముఖ్యఅతిథిగా వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ ధర్మారంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానం ఘన స్వాగతం పలికిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి మరియు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ఘనంగస్వాగతం పలికారు అనంతరం కాన్వయలో రోడ్ షోలో పాల్గొని సంగెం మండల కేంద్రంలో అస్సాం ముఖ్యమంత్రి కి బోనాలతో బతుకమ్మలతో పూలతో మహిళలు స్వాగతం పలికారు ప్రజలను ఉద్దేశించి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అవినీతి రహిత పారదర్శక జవాబు దారి తనంతో కూడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రగతి పథంలో భారతదేశం పరిగెడుతుంది రాజకీయ అధికారంలో కీలకపాత్ర పోషిస్తున్నది రాజ్యాంగ విరుద్ధమైన మత రిజర్వేషన్లు రద్దుచేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు తెలంగాణలోనూ బిజెపి ప్రభుత్వం రావాలి 9 ఏండ్ల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనలో ఏ నీళ్లు నిధులు నియామకాలు కోసం తెలంగాణ సాధించుకున్నాము అవన్నీ నిర్వర్యం అయ్యాయి రూపాయలు 30 వేల కోట్ల కాలేశ్వరం ప్రాజెక్టు 1. 20 లక్షల కోట్లకు పెంచి లోపాలతో అసంపూర్ణంగా నిర్మించడం వల్ల కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ సుందిళ్ల లీకేజీ గోదాట్లో కొట్టుకపోయినా 1.20 లక్షల కోట్ల ప్రజాధనం వ్యర్థం చేశారు కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మొద్దు కర్ణాటకలో కూడా హిమాచల్ ప్రదేశ్ ఇట్లనే చెప్పి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు ఈ దేశంలో గ్యారెంటీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు ఆడపిల్ల పుట్టగానే రెండు లక్షలు మీ పేరు మీద డిపాజిట్ చెయ్యాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని నిరుద్యోగం పోవాలంటే అలాగే పెట్రోల్ రేటు లీటరు మీద 15 రూపాయలు తగ్గిస్తామని మరియు మనకు ఇష్టమైన అటువంటి రామచంద్ర ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కడుతున్నారని ఒక్కసారి ఆలోచించాలని చెప్పారు బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అలాగే గత తొమ్మిది ఏళ్లలో తొమ్మిది లక్షల కోట్లు తెలంగాణకు అందించిన మోదీ ప్రభుత్వం బిజెపి గెలిచాక తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు పదే పదేళ్ల పాలనలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి మూడవ స్థానం దిశగా పయనిస్తుంది కాబట్టి ప్రజలంతా ఆలోచించాలని పరకాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పారు ,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే ధీరజ్ ముని రాజ్ , గోవా ఎమ్మెల్యే సంకల్ప, జీ విజయ చందర్ రెడ్డి ,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ,చేతల రమేష్ సంతోష్ బాబు బిజెపి జిల్లా సెక్రెటరీ ములుగురి శ్రీను, జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు కట్ల రాజేష్, బిజెపి మండల అధ్యక్షుడు బుట్టి కుమారస్వామి ప్రధాన కార్యదర్శి వెంకన్న మైనార్టీ ముఖ్య అధ్యక్షులు ఎండి రహమతుల్లా ,లాగే ముఖ్య కార్యకర్తలు నాయకులు వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular