ఓరుగల్లు9నేషనల్ టీవీ మహబూబ్ నగర్ ప్రతినిధి:-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటును కాంగ్రెస్ కాకి ఎత్తుకుపోతుందని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్ తీసేస్తామని.. దాని స్థానంలో భూమేత తెస్తామని అంటున్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు.తాను మహబూబ్‌నగర్ నుంచే ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రజలు వివేకవంతులన్నారు. ఉద్యమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో పోటీ చేస్తే.. గెలిపించారని హర్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉండే విలువైన ఆయుధం ఓటు మాత్రమేనని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్లు గోస పెట్టింది : ఓటు వేసే ముందు అభ్యర్థితో పాటు వారి పార్టీ చరిత్రను కూడా చూడాలని ఓటర్లకు సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని చెప్పారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్ల పాటు గోసలు పెట్టిందన్నారు. తెలంగాణ రాగానే ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చామని పేర్కొన్నారు.2024 తర్వాత కేంద్రంలో బీఆర్‌ఎస్ కీలకం కానుంది : కేసీఆర్ తెలంగాణ రాగానే ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చామని.. ఆదాయం పెరుగుతున్న కొద్దీ.. సంక్షేమ పథకాలు పెంచుకున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించి.. 80 లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చామన్నారు. రైతుబంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్.. రైతులకు 24 గంటల నాణ్యమైన, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు ఇస్తున్న ఈ 24 గంటల కరెంటు వృథా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని దుయ్యబట్టారు.ధరణి పోర్టల్ తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. ధరణి తీసేస్తే.. రైతుబంధు ఎలా వస్తుందని సభకు విచ్చేసిన ఓటర్లను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే.. రాష్ట్రంలో మళ్లీ దళారుల రాజ్యం కావడమని ధ్వజమెత్తారు. ఇప్పటికే పాలమూరు జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పారు.
24 గంటల కరెంటును కాంగ్రెస్ కాకి ఎత్తుకుపోతుంది.-సీఎం కేసిఆర్-ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES