ఓరుగల్లు9నేషనల్ టీవీ :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో కవిత కళ్లు తిరిగి పడిపోయారు. నవంబర్ 18వ తేదీ ఉదయం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల రోడ్ షోలో పాల్గొన్నారు కవిత. ప్రచార వాహనంలో ఉండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళుతుంది బండి.. ఈ సమయంలో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయారు. కవిత పక్కన ఉన్న వారు ఆమెకు వెంటనే సపరియలు చేశారు.
ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. మంచినీళ్లు తాగి.. కొంచెం గట్టిగా గాలి పీల్చుకుని మళ్లీ ర్యాలీలో పాల్గొన్నారు. ఎండ తీవ్రత కారణంగా కవిత అస్వస్థతకు గురైనట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుుతున్నారు. కొంచెం ఓఆర్ఎస్ పట్టిస్తే.. అంతా సెట్ రైట్ అవుతుందంటున్నారు నేతలు. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా పాల్గొనటం.. రోడ్ షోలో ఉన్న ర్యాలీ వాహనానికి పైన టాప్ కూడా లేకపోవటంతో.. ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు.