. ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి : వరంగల్ జిల్లా సంగెం మండలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా షాపురం గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆ పార్టీ నీ వీడి మండల కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో పార్టీ లో చేరారు అందరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాధారంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు..అనంతరం రేవూరి ప్రకాష్ రెడ్డి. మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి ఐక్యమత్యంతో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు..తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలను గడపగడపకు తెలియజేయలని సూచించారు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అరాచకపాలన, నియంతపాలనను ప్రజలు గమనించారని,కాంగ్రెస్ పార్టీకే ప్రజల మద్దతు ఉందని అటు దేశంలో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు,అలాగే కాంగ్రెస్ పార్టీతోనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు,రైతులకు,నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
కాంగ్రెస్ పార్టీ లోకి కొనసాగుతున్న భారీ చేరికలు
RELATED ARTICLES