ఇవాళ వరల్డ్ వీగన్ డే. వీగన్స్ మాత్రమే జరుపుకునే పండుగని పొరబడుతుంటారు చాలామంది. కానీ, ఈ పండుగ ఎవరైనా చేసుకోవచ్చు. బట్, కండిషన్స్ అప్లై. ఈ ఒక్కరోజు వీగన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. వీగనిజాన్ని ప్రమోట్ చేసే క్యాంపెయిన్స్, ర్యాలీల్లో పాల్గొనాలి. వెజిటేరియన్ ఫుడ్ స్టాల్స్ పెట్టడం, పాట్రక్స్ కండక్ట్ చేయడం, మొక్కలు నాటడం.. లాంటి యాక్టివిటీస్ లో పాల్గొనాలి. అన్నింటికీ మించి అసలైన వీగనిజం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి.
1944 నవంబర్ నెలలో ది వీగన్ సొసైటీని డొనాల్డ్ వాట్సన్ ఏర్పాటు చేశాడు. వీగన్, వీగనిజమ్ అనే పదాలు పుట్టింది కూడా అప్పుడే. వీగన్ సొసైటీని ఏ తేదీన ఏర్పాటు చేశారో కచ్చితంగా గుర్తు లేదు. కానీ, నవంబర్ 1, 1994లో వీగన్ సొసైటీ 50వ యానివర్సరీ సెలబ్రేషన్స్ని జరిపించాడు లూయిస్ వాల్లిస్. ఈ ఏడాది జూన్ లో కొత్తగా ది వీగన్ పాడ్ ను నడిపిస్తున్నారు ఈ సొసైటీ వాళ్లు.
ట్రెండ్ కాదహే.. సెలబ్రిటీలు ఫాలో అయ్యారనో లేదంటే స్పెషల్ డే ఉందనో వీగన్ డైట్ ని, వీగనిజాన్ని ఫాలో కావడం కరెక్ట్ కాదన్నది వీగన్ సొసైటీ పాలసీ. ఎందుకంటే ఇది ట్రెండ్ కాదు.. కంప్లీట్ గా ఇదొక లైఫ్ స్టైల్. వీగనిజంలో.. అది కూడా వీగన్ డేన కేవలం మాంసం మాత్రం ముట్టకుంటే వీగన్స్ అయిపోరు.
వెన్న, జున్ను, తేనె.. ఇలా ఏవీ కూడా తినే తిండిలో ఉండకూడదు. తోలు, ఉన్ని, ముత్యాలు.. ఇలా జంతువులకి సంబంధించిన ఏ ప్రొడక్ట్స్ ఉపయోగించకూడదు. అలాగే మూగజీవాల్ని హింసించకపోవడం కూడా వీగనిజంలో ఒక భాగమే.