ఓరుగల్లు9నేషనల్ టీవీ: రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ చేసుకొని ఎమర్జెన్సీ కారణంగా లేదా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోసం ఇండియన్ రైల్వే గొప్ప సదావకాశాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణించాలి లేదా టిక్కెట్ రద్దు చేసుకోవాల్సి వచ్చేంది. దీంతో సమయం, డబ్బు కూడా వృధా అవుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి లేదు.. రిజర్వేషన్ ను మరొకరికి షేర్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది రైల్వే శాఖ. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ రిజర్వేషన్ టిక్కెట్ ను బదిలీ చేయొచ్చు.. ప్రయాణానికి 24 గంటల ముందు రిక్వెస్ట్ పెట్టుకోవడం ద్వారా రిజర్వేషన్ బదిలీ చేసుకోవచ్చు.
ప్రయాణికులు రైలు బయలు దేరే సమయానికి 24 గంటల ముందు రిజర్వేషన్ ట్రాన్స్ ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అలా చేస్తేనే మరో ప్రయాణికుడి పేరు మీద టిక్కెట్ బదిలీ అవుతుంది. ఎంప్లాయీస్ అయితే పండుగలు, పెళ్లిళ్లు, వ్యక్తిగత కారణాలతో డిపార్చర్ కు 48 గంటలకు ముందు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎన్ సీసీ క్యాడెట్లకు కూడా వర్తిస్తుంది… టిక్కెట్ తన పేర బదిలీ కావాల్సి ప్యాసింజర్ వెరిఫికేషన్ కోసం తప్పని సరిగా ఐడీ కార్డు ను కలిగి ఉండాలి.
టికెట్ ప్రింటవుట్ తీసుకోవాలి.
సమీప రైల్వే స్టేషన్‌ని సందర్శించి రిజర్వేషన్ కౌంటర్‌కి వెళ్లాలి.
టిక్కెట్‌ను బదిలీ చేయాలనుకుంటున్న వ్యక్తి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ వంటి ID తోపాటు మీ ID కాపీ తప్పనిసరి ఉండాలి.
అన్ని డాక్యుమెంట్లతో రిజర్వేషన్ కౌంటర్ ద్వారా టికెట్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోండి.