బంగారం, వెండి ధరలు వరుసగా పడుతున్నాయి. గత వారం రోజులుగా పసడి, వెండి ధరలు కుప్పకూలుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఏకంగా 6 నెలల కనిష్టానికి బంగారం ధరలు పడిపోవడం విశేషం.అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. అక్టోబర్ 3వ తేదీ మంగళవారం బంగారం రూ. 600 తగ్గింది. ప్రస్తుతం24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 660 తగ్గి రూ. 57,380కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి..రూ. 52,600 పలుకుతోంది
అటు వెండి సైతం బంగారం బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర ఏకంగా రూ. 2,000 తగ్గింది. దీంతో మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి రూ. 73,500కు చేరుకుంది.