Monday, December 23, 2024

ఏపీ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్…

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: ఏపీ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో ఇప్పటికే ముద్దాయిగా ఉన్న టీడీపీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్.. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది కోర్టు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. విచారణకు సహకరించాలంటూ లోకేష్ ను ఆదేశించింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్పు స్కాంలో.. సీఐడీ తన ఎఫ్ఐఆర్ లో ఏ14గా చేర్చింది. దీన్ని సవాల్ చేస్తూ.. సీఐడీ అరెస్ట్ చేయకుండా.. ముందస్తు బెయిల్ కావాలంటూ పిటీషన్ దాఖలు చేశారు లోకేష్. దీనిపై సెప్టెంబర్ 29వ తేదీన కోర్టులో వాదనలు జరిగాయి. లోకేష్ తరపు లాయర్ల వాదనను అంగీకరించలేదు కోర్టు. విచారణకు సహకరిస్తే మంచిదే కదా.. నిజానిజాలు వెలుగులోకి వస్తాయి.. విచారణ సమయంలోనే ముందస్తు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని.. లోకేష్ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది కోర్టు. 41ఏ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత.. విచారణ చేయాలంటూ సీఐడీని ఆదేశించింది కోర్టు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular