Monday, December 23, 2024

సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్:నారా లోకేశ్..

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని, సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అని లోకేశ్ తేల్చి చెప్పారు. కొన్నిరోజులుగా ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్.. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం, ఏపీలో పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు.లోకేష్ వెంట కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. జగన్ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

యువగళం పాదయాత్ర మళ్లీ మొదలు పెడతామని చెప్పినందుకే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నన్ను ఏ-14గా చేర్చారని లోకేశ్ ధ్వజమెత్తారు. మా పోరాటం ఆగదని, మా పోరాటాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళతామని లోకేశ్ చెప్పారు. తాను ఢిల్లీలో దాక్కున్నాన‌ని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, తనపై వైసీపీ పెట్టించిన త‌ప్పుడు కేసులో స‌త్తా ఉంటే ఢిల్లీ వ‌చ్చి అరెస్టు చేయొచ్చు క‌దా అని ప్రశ్నించారు. అంటే కేసులో ఏమీ లేదని తేలిపోయిందన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular