సీతమ్మ తల్లి గెటప్ లో అలరించిన చిన్నారి అద్వైత కాందారి

హన్మకొండ జిల్లా ఓరుగల్లు9న్యూస్ ప్రతినిధి: హసన్ పర్తి మండల కేంద్రంలో ఎర్రగట్టు గుట్ట చింతగట్టు క్యాంప్ సమీపంలో ఆదిత్య డిజి హై స్కూల్ లో ఫేర్ వెల్ వేడుకలు పాఠశాల ప్రిన్సిపాల్ రజిత రాణి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ముఖ్యతిధులుగా మండల విద్యాశాఖాధికారి ఎర్ర రాజిరెడ్డి, పాఠశాల ఫౌండర్ చైర్మన్ కట్కూరి రాజిరెడ్డి, సంస్కృతాంధ్ర విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ సతీష్, నీట్ ప్రొఫెసర్ శ్యామ్, కేయూ ప్రోఫెసర్ ఇస్తారిలు హాజరై మాట్లాడుతూ ఆదిత్య డిజి హై స్కూల్ విద్యార్థినీ విద్యార్దులకు నాణ్యమైన విద్యనందిస్తున్న పాఠశాలని, చదువుతో పాటు సంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో పాటు, యోగా, కరాటే తదితర అంశాలపై అవగాహన పెంపొందిస్తూ విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో వుండటం, విద్యార్థినీ, విద్యార్దులకు విద్యావిధానంలో పాఠశాల ఉపాధ్యాయులు అహర్నిశలు శ్రమించి కష్టపడి విద్యాబోధన చేస్తున్నారని కొనియాడారు.



అనంతరం విద్యార్థినీ విద్యార్దులు రాణిరుద్రమదేవి, సీత రామచంద్రులుగా, లక్ష్మణ భరతులుగా, అమ్మ వారీగా, రైతులుగా తదితర నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు జ్యోతి, రాధ, రమ్య, వసుమతి, లావణ్య, నజీమ్, కవిత, రవళి, జ్ఞానేశ్వర్, కిరణ్, సిబ్బంది బషీర్ అహ్మద్, అనిల్, నరేష్, నాగరాజు, శివ, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.