సమిష్టిగా పోరాడుదాం.. అండగా నిలబడుదాం…జనని హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీధర్,ఉపాధ్యక్షులు జయపాల్, ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్…


ఓరుగల్లు9న్యూస్ ప్రతినిధి: జర్నలిస్టులు అనేక సమస్యలకు గురవుతున్నారని
జనని హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ ఉపాధ్యక్షుడు జయపాల్, కోశాధికారి దామోదర్, ఆర్గనైజర్ వెంకన్న తెలిపారు.


శుక్రవారం ఏర్పాటు చేసిన జర్నలిస్టుల జనని హౌసింగ్ సొసైటీ మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ సమిష్టిగా నిలబడాలనే ఉద్దేశ్యంతో జర్నలిస్టుల భవిత కోసం సొసైటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


ఎన్నో అవమానాలకు ఎదురొడ్డి కర్తవ్యం నెరవేరుస్తూ జీతం లేని ఉద్యోగిగా సమాజ సేవకు అంకితమవుతున్న జర్నలిస్టులకు చేయూత, అండ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. సొసైటీలో ఉన్న అందరికీ చేయూతగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు సాగాలని, సమాజంలో జర్నలిస్టుల సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, రిజిస్ట్రేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



