ఓరుగల్లు9న్యూస్ ప్రతినిధి:- హనుమకొండ కలెక్టరేట్ వద్ద మహిళ సంఘాలు ఆందోళన చేసారు.
వివరాల్లోకి వెళ్తే … హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో సిరి గ్రామైఖ్య సంఘం సభ్యులు… శ్రీనిధి సంస్థ నుంచి 25 సంఘాల రుణాలు పొందారు
అయితే ఇట్టి రుణాలకు నెలవారి చెల్లింపులను సిరి గ్రామైఖ్య సంఘంలో V.O.A గా పని చేస్తున్న పద్మకు క్రమంగా చెల్లిస్తున్నారు. ఇదే క్రమంలోసభ్యులు చెల్లించిన పైసలను బ్యాంకులో కట్టకుండా వారి సొంత అవసరాలకు వాడుకుంటుందని మహిళ సంఘం సభ్యులు ఒక్కసారిగా ఆందోళన చేసారు.

సుమారు 17లక్షల రూపాయలు వరకు చెల్లించిన డబ్బులను వాడుకుందని సభ్యులు తెలిపారు. ఇదిఇలా ఉంటే అప్పటికే V.O.A గా పని చేస్తున్న పద్మ అందరికి షాక్ ఇచ్చింది… కోర్ట్ నుండి మమ్మల్ని కాపాడాలని మా ఇంటికి ఎవరు రావద్దు అని లీగల్ నోట్స్ లు జారీచేసింది పద్మ…

దింతో మాకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కు వినతి పత్రం అందజేశారు. తక్షణమే V.O.A గా పని చేస్తున్న పద్మపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది జిల్లా కలెక్టర్ ప్రావీణ్య…
అందరికి న్యాయం చేస్తాం అని హామీ ఇవ్వడంతో అక్కడి నుండి సంఘం సభ్యులు వెళ్లిపోయారు…