Tuesday, February 18, 2025

ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకల కరపత్రాలు ఆవిష్కరణ..-ఓరుగల్లు9న్యూస్

ఓరుగల్లు9న్యూస్ ప్రతినిధి: ఓరుగల్లు వైభవాన్ని చాటే విధంగా, శివతత్వాన్ని చాటే విధంగా ఆధ్యాత్మిక నిలయమైన ఓరుగల్లు గడ్డ మీద ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్న మహా శివరాత్రి కార్యక్రమ కరపత్రికను భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు, గురు పూజ్యులు శ్రీ శేషు అయ్యగారి చేతుల మీదుగా, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి గారి ఆద్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత వెన్నెల శ్రీనాథ్, ప్రముఖ శాస్త్రీయ నృత్య కాళకారిణి చిరంజీవి హిమాన్సి కాట్రగడ్డ, ఇండస్ ఫౌండేషన్ సభ్యులు పత్రికా విలేకరుల సమావేశంలో కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా భద్రకాళి దేవాలయ ప్రధానార్చకులు శ్రీ శ్రీ శ్రీ శేషు అయ్యగారు మాట్లాడుతూ…

🔹ఓరుగల్లు ఒక గొప్ప శైవక్షేత్రం, మన ప్రాంతం లో ఎన్నో శివాలయాలు ఫరీడవిల్లాయి.

🔹ఓరుగల్లు కేంద్రంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపడుతున్నందుకు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి మరియు బృందానికి శుభాశీస్సులు.

🔹మన సంస్కృతిని, సాంప్రదాయాలను భావితరాలకు అందించడానికి వారు చేస్తున్న కృషి అమోఘం.

🔹ప్రతీ ఏడు లాగే ఈ ఏడాది కూడా మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం లో దిగ్విజయంగా సాగాలని, అందుకు ఆ భద్రకాళి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను.

🔹ఇంతటి మహత్కార్యం లో, ఓరుగల్లు ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ…

🔹ఓరుగల్లు ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రం, కాశీ, రామేశ్వరం లాగా మన ఓరుగల్లు కూడా శివతత్వ నిలయం.

🔹కాబట్టి, మన వారసత్వ వైభవాన్ని, మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రయత్నం మొదలు పెట్టడం జరిగింది.

🔹శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి, ఆ పరమ శివుడి అనుగ్రహం తోనే ప్రతీ ఏటా మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుకోగలుగుతున్నాం.

🔹2020 లో మొదటి సారి నిర్వహించినప్పుడు భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు అయ్యగారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

🔹ఆ రోజు తనికెళ్ళ భరణి గారు వేలాది మంది శివభక్తుల నడుమ హయగ్రీవచారి గ్రౌండ్స్ లో నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు అంటూ సనాతన అద్వైత సిద్ధాంత సారాన్ని పాట రూపంలో అందించారు.

🔹ఆ తర్వాత పద్మ శ్రీ గరికపాటి నరసింహ రావు గారు, బ్రహ్మ శ్రీ, పద్మశ్రీ మాడుగుల నాగఫని శర్మ గారు, బ్రహ్మ శ్రీ గంగాధర శాస్త్రి గారు, రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందర రాజన్ గారు, పద్మశ్రీ సమ్మయ్య, శశిధర్ శర్మ, రాధా మనోహర్ దాస్ గార్లు ఇలా అనేక మంది ఈ వేదిక నుండి ప్రవచనాలు ఇచ్చారు.

🔹అలాగే ఎందరో కవులు, కళాకారులు, కళా రూపాలను ప్రదర్శన చేశారు. చిన్నారులు నృత్యాలు, దేశభక్తి గీతాలు, సందేశాలు ఇచ్చారు.

🔹అలా ప్రతీ ఏడు మన ఓరుగల్లు వైభవాన్ని, ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా వైభవాన్ని చాటుతూ ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది.

🔹వివిధ రంగాల్లో ప్రతిభను కనపర్చిన, సేవలందించిన ప్రతిభావంతులకు, మన ఓరుగల్లు వైభవాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతున్న వారికి ప్రతీ ఏడు లాగే ఈ ఏడాది కూడా కాకతీయ పురస్కారం ప్రధానం చేసి, సత్కరించుకోవడం జరుగుతుంది.

🔹ఈ ఏడాది చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్, ఇస్కాన్ స్వామి జీ శ్రీ స్వామి ప్రణవానంద దాస్, శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గార్లచే ప్రవచనాలు.

🔹చిందు యక్షగాన కళాకారులు పద్మ శ్రీ గడ్డం సమ్మయ్య గారు, ప్రముఖ గేయ రచయిత, కవి, దేశపతి శ్రీనివాస్, అనంత శ్రీ రాం లచే తెలంగాణ సాంస్కృతిక కళా వైభవం సందేశాలు ఉంటాయి. అలాగే జాగరణ లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, నృత్యాలు, పేరణి శివతాండవం, సహస్ర లింగార్చన, సప్త హారతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

హిందువాహిని శ్రీ రాం ఉదయ్ మాట్లాడుతూ…

🔹 ఒకవైపు దేశంలో కుంభమేళా జారుతూ దేశమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

🔹కాశిలో ఎంత వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు, మహా హారతి కార్యక్రమం జరుగుతుందో అంతే వైభవంగా మన ఓరుగల్లు లో కూడా ప్రతీ ఏటా జరుగుతాయి.

🔹అంతటి మహాత్కారంలో అందరూ భాగస్వాములు కావాలని, హిందువాహినీ ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాకేష్ రెడ్డి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా అండగా ఉంటామని తెలిపారు.

🔹కాబట్టి, కేవలం కొందరి కార్యక్రమం లాగా కాకుండా ఓరుగల్లు ప్రజల ఉత్సవంగా స్వీకరించి విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

అతిథులు వెన్నెల శ్రీనాథ్, హిమాన్సీ మాట్లాడుతూ…

🔹ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం లో కేవలం దైవిక కార్యక్రమాలకే కాకుండా ఒక సాంస్కృతిక సమ్మేళనం గా నిర్వహిస్తూ కళలకు పెద్దపీట వేస్తూ వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు ఆనందంగా ఉందని,

🔹ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు కాబట్టి, ఆ కళా వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం లో మావంతు కృషి చేస్తున్నామని అన్నారు.

🔹కళా కారులు, మేధావులు, అందరూ ఈ మహత్తరమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం లో పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఇండస్ ఫౌండేషన్ మహా శివరాత్రి కార్యక్రమ కో ఆర్డినేటర్ లు అభిషేక్, దీపక్, కార్పొరేటర్ రవి నాయక్, డాక్టర్ కొమురన్న, శానబోయిన రాజు కుమార్, జంపన్న, దేవయ్య, కొండారి రవి, గొల్ల నరేందర్, తోట సూకాంత్, కొనుకటి ప్రశాంత్, జెట్టి రాజేందర్, విజయ్, శ్యాము, గువ్వ రాజేష్, వినయ్, వంశీ, లక్ష్మణ్, అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular