ఓరుగల్లు9నేషనల్ టీవీ :రాష్ట్రంలో ఎలక్షన్కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీమ్స్‌కు బ్రేక్ పడింది. 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేయగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వరంగల్–- -ఖమ్మం– -నల్లగొండ ఉపాధ్యాయ, మెదక్- -–నిజామాబాద్–- -ఆదిలాబాద్– -కరీంనగర్ ఉపాధ్యాయ, మెదక్– – నిజామాబాద్–– ఆదిలాబాద్–- కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 7 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 40 రోజులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తప్ప మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలో కోడ్ వర్తిస్తుంది.ఈ నేపథ్యంలో మార్చి 8 వరకు ఇప్పటికే ప్రకటించిన స్కీమ్స్‌ను మాత్రమే అమలు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరు స్కీమ్‌లను ప్రారంభించింది. లబ్ధిదారులకు నగదు బదిలీతోపాటు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సాంక్షన్ పత్రాలు అందచేసింది. ఇవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగనున్నాయి.
ఈ నేపథ్యంలో మార్చి 8 వరకు ఇప్పటికే ప్రకటించిన స్కీమ్స్‌ను మాత్రమే అమలు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరు స్కీమ్‌లను ప్రారంభించింది. లబ్ధిదారులకు నగదు బదిలీతోపాటు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సాంక్షన్ పత్రాలు అందచేసింది. ఇవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగనున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే నెల 27న జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికల పక్రియ మార్చి 8న ముగియనున్నది. మరుసటి రోజు ఎన్నికల కోడ్ ముగుస్తుంది. మార్చి 29న 3 ఎమ్మెల్యే కోటా, ఆగస్ట్ 6న హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ టర్మ్ సైతం ముగియనున్నది. వీటికి కూడా త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ లోపే లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో ఒక దశ లేదా రెండు దశల్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. మార్చిలో ఈ పక్రియ ముగియనుందని సమాచారం. ఇక లోకల్ బాడీ పూర్తయ్యాక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించే అవకాశముందని తెలుస్తున్నది. ఈ ఏడాది చివరలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగనున్నట్టు సమాచారం. 2020 డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగ్గా తర్వాత ఏడాది ఫిబ్రవరిలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీటితోపాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మంతో పాటు పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల టర్మ్ కూడా ముగియనున్నది.