చెరువులో దూకిన మహిళను కాపాడిన స్థానికులు.
బయోమెట్రిక్ పనిచేయని దవఖాన.
ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 09 :
నర్సాపూర్ జి మండల కేంద్రానికి చెందిన పందిరి మమత సోమవారం 12 గంటల సమయంలో బసంత చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు సమాచారం పోలీసులకు గ్రామస్తులకు అందించారు వెంటనే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కృష్ణ చౌహాన్, పాత్రికేయుడు జాబీర్ చెరువు వద్దకు వెళ్లారు. అప్పటికే నీటిని మింగడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మమతకు కానిస్టేబుల్ కృష్ణ చౌహాన్ పాత్రికేయుడు జాబీర్ సి పి ఆర్ చేసి నీటిని బయటకు తీశారు. చెరువు వద్దకు 108 అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులు 30 పడకల ఆసుపత్రి వరకు వెళ్లారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చెరువులో పడ్డ మహిళ కు ఐసీఈలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఏదేమైనా సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ కృష్ణ చౌహన్, పాత్రికేయుడు జాబీర్,కె. రవి ను మండల ప్రజలు అభినందించారు.
నర్సాపూర్ జి 30 పడకల దవఖానలో పనిచేయని బయోమెట్రిక్
పేరుకే 30 పడకల దవఖాన సమయానికి ఒక్క డ్యూటీ డాక్టర్ ఉండరు. ఎమర్జెన్సీలో హాస్పిటల్ కి వచ్చేవారికి నిర్మల్ , బైసా కి పిస్తున్న సిబ్బంది. నర్సాపూర్ జి ప్రభుత్వ ఆస్పిటల్ గురించి ఎన్నిసార్లు పత్రికల్లో కథనాలు రాసిన స్పందించని అధికారులు. చూసి చూడనట్టు ఉండడం చేత పనిచేస్తున్న సిబ్బంది ఇష్టరాజ్యంతో నడిపిస్తున్నారు. నిర్మల్, బైంసా మధ్యలో ఉన్న ఏకైక ప్రభుత్వ దవాఖాన అని లోస్రా కుంటాల బైంసా దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు డాక్టర్లు అందుబాటులో లేరని వెను తిరుగుతున్నారు