ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 29:
పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని పెంబి మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని మండల గౌడ సంఘం నాయకుడు ముష్కం సుదర్శన్ గౌడ్ అన్నారు. గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సర్పంచ్ అరుగుల పూర్ణచందర్ గౌడ్ ను పరామర్శించారు. ప్రభుత్వం స్పందించి మాజీ సర్పంచులు అభివృద్ధి పనులు చేసి ఆప్పుల పాలు అయ్యారని వారి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.