Sunday, December 22, 2024

లక్ష్మీ బాంబ్ కాదు.. ఆటమ్ బాంబ్ పేలబోతుందని:మంత్రి పొంగులేటి

ఓరుగల్లు9నేషనల్ టీవీ :వర్ధన్నపేట సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ బాంబు పేలబోతుందని తాను చేసిన వ్యాఖ్యలను చూసి నవ్వారని, పేలబోయేది నాటు బాంబ్ కాదు.. లక్ష్మీ బాంబ్ కాదు.. ఆటమ్ బాంబ్ పేలబోతుందని మంత్రి పొంగులేటి మరోసారి బాంబు పేల్చారు. తప్పుచేసిన వారిని చట్టం వదిలి పెట్టదని, తాను కానీ.. ముఖ్యమంత్రి కానీ ఎవరి పేరు ప్రకటించ లేదని, తప్పు చేయకపోతే మీకు అంత ఉలిక్కిపాటు ఎందుకని కేటీఆర్ను ఉద్దేశించి మంత్రి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.ఆస్తులు పెంచుకోవడం కోసం పేదల సొమ్ము విదేశాలకు పంచిన వారిని చట్టం వదలదని, చట్టం తనపని తాను చేసుకుంటదని పొంగులేటి వ్యాఖ్యానించారు.

55 కోట్ల రూపాయల పేదల సొమ్ము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో త్వరలోనే బయట పడుతుందని మంత్రి చెప్పారు. అవి ఎవరు తీసుకున్నారో బయట పెడతామని, పేదలను మరిచిపోయి అధికార దాహంతో ఎలాంటి కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మంత్రి మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో తప్పకుండా దోషులుగా నిలబడాల్సిందేనని, కారు కూతలు కూస్తున్న నేతలు ఏ టైర్ కింద తల పెడతారని మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ నేతలను సూటిగా ప్రశ్నించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular