జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో రైతు అవగాహన సదస్సు ఏర్పాట్లపై పంచాయతీ, వ్యవసాయ, హార్టికల్చర్, డి.ఆర్.డి.ఏ.అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి నారాయణ మాట్లాడుతూ, ఈనెల 26న రైతు అవగాహన సదస్సును అధికారులు సమన్వయంగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. గద్వాల రైతు సదస్సు శనివారం 26వ తేదీ నాడు ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 వరకు గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (గంజి)లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రైతులను సదస్సుకు పెద్ద ఎత్తున తరలించేందుకు జిల్లా పంచాయతీ అధికారి, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, డి.ఆర్.డి.ఓ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు సంబంధించిన ప్రత్యేకమైన స్టాళ్లు కూడా ఏర్పాటు చేయాలని, ఈ సదస్సులో ప్రధానంగా రైతులకు ఉద్యానవనంపై అవగాహన కల్పించేందుకు శాస్త్రవేత్తలు హాజరవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి శ్యామ్ సుందర్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ భాష, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, ఏడీఏ లు, ఏపీయం, డిపియం తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 26న నిర్వహించే రైతు అవగాహన సదస్సుకు సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున రైతులను తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి నారాయణ ఆదేశించారు. ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES