జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు ఛాంబర్ నందు అన్ని మండలాల తహసీల్దార్ల తో పెండింగ్ ధరణి దరఖాస్తులపై సమీక్ష సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి నారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ధరణి, ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లకు ఆదేశించారు. మాడ్యూల్ 33 కు సంబంధించి పూర్తి చేయడం, ప్రొహిబిటెడ్ ల్యాండ్ దరఖాస్తులను, పెండింగ్ మ్యూటేషాన్, సక్సెషన్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
కుల, ఆదాయ సర్టిఫికేట్లు, OBC సర్టిఫికేట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. శాదీ ముబారక్,
కళ్యాణి లక్ష్మి కు సంబంధించిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సీఎం గ్రీవెన్స్ ఫిర్యాదులను,ఎక్స్ సర్వీస్ మాన్, ఫ్రీడం ఫైటర్ కు సంబంధించిన నో అబ్జాక్షన్ సర్టిఫికెట్స్ త్వరగా పరిశీలించి పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యాచరణను అన్ని మండలాల తహసీల్దార్లు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అందించిన అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈసమావేశం లో ఆర్.డి.ఓ రామ్ చందర్, ఎ.ఓ వీరభద్రప్ప, అన్ని మండలాల తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ లో ఉన్న ధరణీ దరఖాస్తులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి నారాయణ తహసీల్దార్లకు ఆదేశించారు. ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES