జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఛాంబర్ నందు డి.ఎస్.సి-2024లో కొత్తగా నియమితులైన స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు నియామక పత్రాలు కలెక్టర్ చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియమితులైన ఉపాధ్యాయులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగారావు, జెడ్పి సిఈఓ కాంతమ్మ ,విద్యా శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో డి.ఎస్.సి-2024 ద్వారా కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ అనంతరం నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ అందజేశారు . ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES