జోగులంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు ప్రాధాన్యత క్రమంగా అవసరమైన పాఠశాలలకు కేటాయించడం జరుగుతుందన్నారు. మెరిట్ ఆధారంగా ఆన్ లైన్ పద్ధతిలో పూర్తి పారదర్శకతతో కేటాయింపులు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటికే నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయ అభ్యర్థులు కేటాయించిన పాఠశాలలో బుధవారం విధులకు ఖచ్చితంగా హాజరు కావాలన్నారు. కేటాయింపులు అనంతరం ఎలాంటి సిఫారసులకు తావు లేదని, ఉపాధ్యాయులందరూ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, రాబోయే పరీక్షలలొ మంచి ఫలితాలు సాధించి జిల్లాను మొదటి వరుసలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపికైన ఉపాధ్యాయులందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగారావు, జెడ్పి
సిఈఓ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
గద్వాల జిల్లాలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకమైన స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES