ఓరుగల్లు9నేషనల్ టీవీ :వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ భద్రకాళి దేవీ శరన్నవరాత్ర మహోత్సవములు ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఏడవ రోజు కార్యక్రమాలలో భాగంగా ఉదయం గంటలు 04-00లకు అర్చకులు నిత్యాహ్నికం నిర్వర్తించి అమ్మవారిని సరస్వతీమాతగా అలంకరించడానికి ఆంగీకార ప్రార్ధన జరిపి సూచన వచ్చిన వెంటనే అమ్మవారిని సరస్వతీమాతగా అలంకరించి పూజారాధనలు జరిపారు. ఈ రోజు అమ్మవారు సాధకుడి బుద్దిలోకి ప్రవేశిస్తుంది. సరస్వతీ మాతగా అలంకరింపబడిన అమ్మవారి దర్శనం వల్ల సాధకుడికి సకల విద్యలు సమకూరుతాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. ఈ రోజు అమ్మవారికి రథసేవ జరిపారు. శరీరాన్ని రథంతో పోలుస్తారు. రథసేవలో సేవింపబడుతున్న అమ్మవారి రథాన్నిలాగితే ఈ జీవన రథం అనేది బాగా సాగుతుందని నమ్మకం. అందుకు అనేకమంది భక్తులు పోటీపడుతూ రథాన్ని లాగారు. నవరాత్ర కల్పాన్ననుసరించి కాళరాత్రి మరియు రక్త బీజహా దుర్గా క్రమంలో అమ్మవారికి పూజారాధనలు జరిపారు.
రేపు మహాష్టమి (దుర్గాష్టమి) భద్రకాళి అమ్మవారి జన్మోత్సవం. ఆదిపరాశక్తి భద్రకాళిగా కోటి యోగిని గణములతో ప్రాదుర్భావం చెందిన రోజు. బతుకమ్మ కూడా దుర్గాష్టమినాడే జన్మించిందని ఆనాడే చద్దులు చేయడమనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.
ఈ రోజు కార్యక్రమాలకు శ్రీ యాదా సత్యదీప్-ప్రవల్లి దంపతులు, శ్రీ కటకం సత్యనారాయణ-రంగమణి దంపతులు, శ్రీ కటకం సాయినీలేష్, శ్రీ రామా రాకేశ్-రమ్య దంపతులు, శ్రీ ఆకవరం వెంకట్ రెడ్డి-సృజన దంపతులు, సాయి మణికంఠ రెడ్డి, సోమనరసింహ రెడ్డి-పున్రెడ్డి కృష్ణా రెడ్డి – రజని దంపతులు, బుచ్చమ్మ, శ్రీ బొల్లమ్ వెంకటేశ్వర్లు-సునీత దంపతులు, డాక్టర్ సనత్ కుమార్, డాక్టర్ సాహితి రమ్య, డాక్టర్ వైష్ణవి, శ్రీ పింగిలి పవన్ రెడ్డి – శ్రీలత దంపతులు, డాక్టర్ ప్రణీత్ కుమార్, డాక్టర్ రూపశ్రీ దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఉబయ దాతలకు పూజానంతరం అమ్మవారి శేషవస్త్రములు బహూ కరించి ప్రసాదములు ఆందజేశారు.ఈరోజు ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులలో ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య తదితరులు ఉన్నారు.అనంతరం సాయంకాలం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అలరించాయి. భద్రకాళి భక్త సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసాద వితరణ జరిపారు.