ఓరుగల్లు9నేషనల్ టీవీ :వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవిశరన్నవరాత్రులు ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం గంటలు 04-00లకు నిత్యహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని భవానీమాతగా అలంకరించడానికి ఆంగీకార ప్రార్ధన జరిపి సూచన వచ్చిన వెంటనే అమ్మవారిని భవానీమాత గా అలంకరించి పూజారాధనలు జరిపారు. ఎక్కడైతే భోగముంటుందో అక్కడ మోక్షముండదు, ఎక్కడైతే మోక్షముంటుందో అక్కడ భోగముండదు. కానీ అమ్మవారి భక్తులకు భోగ మోక్షాలు రెండు కలుగుతాయని శాస్త్రం చెబుతున్నందున అమ్మవారిని భవానిగా అలంకరించడం జరిగింది. ఎందుకంటే అమ్మవారు శంకరుడికి భవాని రూపంలో సమస్త భోగాలనిస్తుందని శాస్త్రం చెబుతోంది. భవాని మతగా అలంకరించిన అమ్మవారిని రార్శించుకోవడం వలన సమస్త భోగాలు కలుగుతాయి. ఈ రోజు అమ్మవారికి కాత్యాయని క్రమంలోను మరియు భోదాయనమహర్షి ప్రోక్త నవరాత్రా కల్పాన్ని అనుసరించి ధూమ్రహా క్రమంలోను పూజారాధనలు జరిపారు. అట్లాగే అమ్మవారికి గంధూోత్సవం నిర్వహించారు. అట్లాగే సాయంకాలం సాలభంజిక సేవ జరిపారు. రేపు అమ్మవారిని సరస్వతిగా అలంకరిస్తారు.
ఈ రోజు అమ్మవారి విశేష అలంకరణకు కరీంనగర్ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ యాదా కిషన్-శోభ దంపతులు, శ్రీ మంచాల శ్రీకాంత్-కవిత దంపతులు, శ్రీ మంచాల నవీన్- స్వప్న దంపతులు, శ్రీ రేగూరి ఆంజనేయులు-సరళ దంపతులు, హైదరాబాద్ శారధ విద్యాసంస్థల అధినేతలు శ్రీ సందెపూడి రవి శంకర్-మానస, శ్రీ తిక్కవరపు కేశవ రెడ్డి-మంజుల దంపతులు, శ్రీ అభిరామ్ రెడ్డి- సింధూర దంపతులు తదితరులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. పూజనంతరం ఉభయ దాతలకు ఆలయ ఈ.ఓ శ్రీమతి శేషుభారతి శేష వస్త్రములు బహుకరించి ప్రసాదములు ఆందజేశారు.
ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులలో వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అమ్మవారి తెప్పోత్సవం సందర్భంగా భద్రకాళి చెరువులో గుర్రపుడెక్క ఆకు తొలగింపు కార్యక్రమం పరిశీలించారు. తదుపరి యాదగిరిగుట్ట ఛైర్మన్ శ్రీ భాస్కరాయని నరసింహ మూర్తి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.సాయంకాలం నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరికథ, భక్తి సంగీతం, కర్నాటక సంగీతం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఎంత గానో అలరించాయి.శేషుభారతి కార్యనిర్వాహణాధికారి & సహాయ కమిషనర్