జోగులాంబ గద్వాల జిల్లా ఓర్గల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సంగాల చెరువు నందు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి చేప పిల్లలను రిజర్వాయర్ లో వదిలారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం చేప పిల్లలను చెరువులలో వదలడం జరిగిందని తెలిపారు. మొత్తం 65,400 చేప పిల్లలను వదలడం జరిగిందని, ఈ చేప పిల్లలలో కట్లు, బొచ్చు, శీలావతి, మృగలు వంటి నాలుగు రకాల చేపలు ఉన్నాయని తెలిపారు. ఈ చేపలు స్థానిక మత్స్యకారులకు ముఖ్యమైన ఆదాయ వనరులను అందించడం ద్వారా, మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వంద శాతం రాయితీ పై మత్స్య కారులకు చేపపిల్లలను సరఫరా చేసిందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, మన రాష్ట్రంలో నదులు మరియు సముద్రాల శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఉన్న నీటి వనరులను సమర్ధంగా ఉపయోగించుకొని చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు.ఈ విధానంలో అన్ని చెరువులను అభివృద్ధి చేసి, చేప పిల్లలను పెంచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, అసిస్టెంట్ డైరెక్టర్ షకీలా భాను, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకానికి ప్రోత్సహిస్తోందని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES