Friday, June 27, 2025

దసరా సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు:ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకునే దసరా పండుగ సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలకు ఈ నెల (అక్టోబర్) 6 నుండి 13వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. తిరిగి 14వ తేదీన కాలేజీలు రీ ఓపెన్ కానున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ (అక్టోబర్ 3) ఇంటర్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. బోర్డు ఆదేశాలు పాటించకుంటే ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇంటర్ విద్యార్థులకు మొత్తం 8 రోజులు దసరా హాలీడేస్ ప్రకటించింది.

నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో క్లాసులు నిర్వహిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలను హెచ్చరించింది. కాగా, తెలంగాణలో పాఠశాలలకు విద్యాశాఖ ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో దసరా పండుగ వాతావరణం నెలకొంది. బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని ఊరు, వాడల్లో పండుగ శోభ సంతరించుకుంది. దసరా సెలవులు షూరు కావడంతో అంతా సొంత ఊర్లకు బయలుదేరుతున్నారు. కాగా, ఈ నెల 12న రాష్ట్రంలో దసరా పండుగ జరుపుకోనున్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular