జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం వీరాపురం సమీపంలోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కళాశాలను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగా రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాలేజీలో విద్యార్థుల అభ్యసన విధానాలను పరిశీలించారు. విద్యార్థులతో సన్నిహితంగా మాట్లాడి వారి బోధన విధానాలు, అవగాహన స్థాయి, ప్రగతి గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రతిభను విశ్లేషిస్తూ విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మార్గదర్శక సూచనలు చేశారు.
విద్యార్థుల జీవితాలను సక్రమంగా తీర్చిదిద్దడంలో మంచి విద్య ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులకు వివరించారు. విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలంటే ఉపాధ్యాయులు సక్రమంగా శ్రద్ధ వహించి, విద్యార్థులకు వారి ప్రతిభను పెంపొందించేందుకు కొత్త విధానాలను అమలు చేయాలని సూచించారు. చదువుతో పాటు విద్యార్థుల్లో శారీరక, మానసిక అభివృద్ధి సైతం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతపై కూడా దృష్టి సారించాలని అన్నారు. భోజనం సమయంలో అందించే ఆహారం వారి ఆరోగ్యానికి ఎంతో కీలకమని, ఆహార నాణ్యతకు ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన అధికారులకు తెలిపారు. ప్రతి రోజు విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారంతో పాటు స్వచ్ఛత కూడా చాలా ముఖ్యం అని పేర్కొన్నారు.
విద్యార్థులు చదివే వాతావరణం పరిశుభ్రంగా ఉండటం ద్వారా వారు ఆహ్లాదకరంగా, ఏకాగ్రతతో చదువుకోవచ్చని అన్నారు. ప్రిన్సిపల్ మరియు పాఠశాల సిబ్బందిని పాఠశాల పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, అక్కడ ఎలాంటి అపరిశుభ్రత ఉండకుండా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల చదువు, వారి ఆరోగ్యం, మరియు పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగా రావు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES