ఓరుగల్లు9నేషనల్ టీవీ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం బీరెల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి ఘనంగా నిర్వహించారు. బహుజనసేవ జిల్లా అధ్యక్షుడు బీరెల్లి
దానయ్య మాట్లాడుతూ.
తెలంగాణ ఉద్యమ నాయకురాలు కామ్రేడ్ చాకలి ఐలమ్మ, వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో 1895, సెప్టెంబరు 26న ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. వీరిది వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. 1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది అని అన్నారు.అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు.
ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించింది అని. ఈ సందర్భంగా వారు ఐలమ్మ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నీల్లేశ్వర్ రెడ్డి, పోస్ట్ బీచుపల్లి , మాజీ సర్పంచ్ జయన్న,రజక సంఘం అధ్యక్షులు రామకృష్ణ, పరశురాముడు, స్టాలిన్, సాకలి సింగోటం. చాకలి వెంకటన్న, నడిపిన, ఏఫోన్, దేవన్న, గడ్డం నరసింహ, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు
బీరెల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి ఘనంగా నిర్వహించారు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES