ఓరుగల్లు9నేషనల్ టీవీ :డీఎస్సీ 2008లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాలను ఉమ్మడి జిల్లాల వారిగా బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు www.schooledu.telangana.gov.in వెబ్ సైట్లో పెట్టనున్నారు. దీంట్లోనే ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తూ ధ్రువీకరించే పత్రం కూడా ఉంటుంది. దీన్ని నింపి ఉమ్మడి డీఈఓ ఆఫీసుల్లో సమర్పించాల్సి ఉంటుంది.
కాగా, ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకూ డీఈఓ ఆఫీసుల్లో జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పాల్గొనాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహా రెడ్డి తెలిపారు. ఆ తర్వాత వచ్చేవారికి అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.