జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా నవోదయ, గురుకుల, సైనిక్ స్కూల్, కోచింగ్ సెంటర్ నడుపుతున్నారని బహుజన సేనా జిల్లా అధ్యక్షుడు బీరెల్లి దానయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గద్వాల జిల్లాలోని జిల్లా కేంద్రంతోపాటు, అయిజ, ఎర్రవల్లి చౌరస్తా, మల్దకల్, అలంపూర్ చౌరస్తా, అలంపూర్, శాంతినగర్ మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే గురుకుల కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారని, అలాగే ప్రయివేట్ పాఠశాలలకు రెసిడెన్షియల్ పర్మిషన్ లేకున్నా హాస్టళ్లు నడుపుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి వేలలో ఫీజులు వసూలు చేస్తున్నారని, హాస్టళ్లలో సరైన భోజనం, రూమ్స్, బాత్రూంలు లేకున్నా తల్లిదండ్రుల నుంచి ఫీజులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని అన్నారు. గురుకుల, నవోదయ, సైనిక్ స్కూల్స్ కోచింగ్ సెంటర్లలో విద్యార్థులకు కనీస సదుపాయాలు లేకున్నా ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ. 7వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇదంతా విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యా శాఖ అధికారులు స్పందించి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై, రెసిడెన్షియల్ పర్మిషన్ లేని స్కూళ్ల యజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
అనుమతులు లేకుండానే నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లు-యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి-బహుజన సేనా జిల్లా అధ్యక్షుడు బీరెల్లి దానయ్య డిమాండ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES