ఓరుగల్లు9నేషనల్ టీవీ :రాష్ట్రంలో హైదరాబాద్ పలు ప్రాంతాలతోపాటు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము ఓ మోస్తరు వర్షాలు ప్రారంభమైయ్యాయి. ప్రస్తుతం తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మంగళవారం రాత్రి నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఉదయం నుండి భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల్, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మాల్కజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు వాన పడుతుంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
రానున్న 2-3 గంటల్లో హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగులో ఈస్ట్ తెలంగాణ జిల్లల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని హెచ్చరికలు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమతతంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు.హైదరాబద్ లో రాత్రి నుంచే ఎడతెరిపి లేనికుండ వర్షం కురుస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాల్లో మంళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 గంటల వరకు జోగులాంబ గద్వాల్, వనపర్తి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.