జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప ఆదేశాల మేరకు మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసూన రాణి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ డెమో, హెల్త్ అసిస్టెంట్ నరసయ్యలు మంగళవారం ఇటిక్యాల మండలం, కొండేరు గ్రామంలో ఆర్ఎంపిలు మోహన్, రమేష్ లు నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో జిల్లా అధికారులు ప్రథమ చికిత్స కేంద్రాలలో అధిక మొత్తంలో మందులు (యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, క్యాల్షియం ఇంజక్షన్స్, బీ- కాంప్లెక్స్ ఇంజక్షన్స్, చిన్నపిల్లలకు ఇచ్చే సిరప్స్) నెబులైజర్, పెద్దలకు ఇచ్చే యాంటీబయాటిక్ ఇంజక్షన్స్, ఆస్తమా రోగంకు సంబంధించిన మెడిసిన్స్, వివిధ ప్రవేటు ఆసుపత్రులకు సంబంధించిన రెఫరల్ స్లిప్పులు ఉండడం, ఐవి స్టాండ్స్, బెడ్స్ గమనించారు. అదేవిధంగా రక్త పరీక్షల కోసం దగ్గర్లోని ల్యాబ్ లకు రోగులను రెఫర్ చేసి టెస్టులను చేయించి చికిత్సలు కూడా చేస్తున్నట్లు అధికారులు వారి దగ్గర ఉన్న రోగుల టెస్ట్ రిపోర్టులను పరిశీలించారు. ప్రథమ చికిత్సలు నిర్వహిస్తున్న వారు ప్రథమ చికిత్సలు చేయకుండా అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు చేస్తుండడం, ప్రథమ చికిత్స కేంద్రం బోర్డుపై డాక్టర్ సింబల్ ఉంచుకోవడం వల్ల, ప్రథమ చికిత్స కేంద్రాలలో ఎక్కువ మొత్తంలో మెడిసిన్స్, ఐవి స్టాండ్స్, బెడ్స్ (క్లినిక్ సెట్ అప్) ఉండడంతో మోహన్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మూసి వేశారు. నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేసిన వైద్యాధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES