Tuesday, December 24, 2024

ఆర్ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవు-జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా : జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఆర్ఎంపిలు తమ పరిధిని దాటి వైద్యం చేస్తున్నట్లు తెలుస్తోందని, ఇకపై ఎవరైనా తమ అర్హతకు మించి వైద్యం చేస్తున్నట్లు తెలిస్తే వారిపై చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.కె. సిద్దప్ప హెచ్చరించారు. మంగళవారం జిల్లా సమీకృత భవనంలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆర్ఎంపీలతో వారు చేయాల్సిన చికిత్సల పరిధి గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలోని గద్వాల మండలం, గోనుపాడు గ్రామంలో ఆర్ఎంపి నరేందర్ రెడ్డి తన స్థాయికి మించి రోగులకు చికిత్సలు నిర్వహించడంతో కొంతమంది రోగులు అస్వస్థత గురికావడం జరిగిందన్నారు. దీనిపై ధరూర్ మండలంలోని ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఏంజెల్ ద్వారా గోనుపాడు గ్రామంలో ఆర్ఎంపి నరేందర్ రెడ్డి, రోగులకు చేసిన చికిత్సలు, చేసిన టెస్టుల గురించి, రోగులకు ఇచ్చిన మందులపై విచారణ చేసి నివేదిక తయారు చేశారని, ఇట్టి నివేదికను జిల్లా కలెక్టర్ కి అందజేస్తున్నామని, అనంతరం కలెక్టర్ ఆదేశానుసారం ఆర్ఎంపిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ఉన్న ఆర్ఎంపీలందరు తమ స్థాయికి మించి చికిత్సలు చేసినట్లయితే ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఆర్ఎంపి ప్రథమ చికిత్సలు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆర్ఎంపిలు నిర్వహించే క్లీనిక్ ముందు ప్రథమ చికిత్స అనే బోర్డు రాసుకోవాలని, ఎటువంటి + (ప్లస్ మార్క్) (రెడ్, గ్రీన్) మార్కు ప్రథమ చికిత్స బోర్డు పక్కల రాయకూడదని, రోగులకు ఎటువంటి ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టేరాయిడ్స్ మందులు ఇవ్వకూడదని సూచించారు. ప్రథమ చికిత్స కేంద్రంలో ఎటువంటి మంచాలు కానీ, ఐవి స్టాండ్స్, ఐవి ఫ్లూయిడ్స్, నెబులైజర్, ఎక్కువ మొత్తంలో మందులు, ఉంచుకోకూడదని, ప్రైవేట్ హాస్పిటల్ కు రెఫర్ చేసే రిఫరల్ స్లిప్పులు, మందులు రాసే బుక్స్ ఉండకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చికిత్స నిర్వహించకూడదని ఆదేశించారు. ఇకపై జోగులాంబ గద్వాల జిల్లాలో ఎవరైనా ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సలు నిర్వహించకుండా తమ స్థాయికి మించి చికిత్సలు నిర్వహించినట్లయితే అట్టి ఆర్ఎంపీలపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఏంజెల్, ఇంచార్జి డిప్యూటీ డెమో కె. మధుసూదన్ రెడ్డి, ఆర్ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular