జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : వర్షాకాలంలో సంభవించే వ్యాధులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ మంగళవారం బహుజన సేన జిల్లా అధ్యక్షులు. బీరెల్లి దానయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శశికళకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులు మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగు, జలుబు, దగ్గు, కలరా, అతి సార తదితర వ్యాధులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రం, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డాక్టర్లు సరైన సమయానికి రావట్లేదని వివిధ గ్రామాల ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిఎంహెచ్ఓకి విన్నవించారు. అలాగే మండల కేంద్రంలో ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న వివిధ డయాగ్నొస్టిక్ సెంటర్లు రోగుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారని, డయాగ్నొస్టిక్ సెంటర్ బయట ధరల పట్టిక బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, బీచుపల్లి, అశోక్, రాముడు, సాయి తదితరులు పాల్గొన్నారు.
వర్షాకాలంలో సంభవించే వ్యాధులకు మెరుగైన వైద్యం అందించాలి డీఎంహెచ్ఓ డాక్టర్ శశికళకు వినతి పత్రం అందజేసిన బీరెల్లి దానయ్య ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES