Friday, November 15, 2024

హన్మకొండలో రాక్స్ ఐటీ సొల్యూషన్ ను ప్రారంభించిన ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.-ఓరుగల్లు9నేషనల్ టివి

ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి: విదేశాలలో స్థిరపడ్డ మన తెలంగాణ ప్రాంత వ్యక్తులందరూ ముందుకు వచ్చి ఇక్కడ నగరాలలో మీ యొక్క వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ కామర్స్ మరియు శాసనసభ వ్యవహార శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం హనుమకొండలోని రంజిత్ రావుల ఏర్పాటుచేసిన రాక్స్ ఐటీ సొల్యూషన్ ను ప్రారంభిస్తూ రావుల గారు తన సొంత ప్రాంతం తన సొంత జిల్లా అనే ఆలోచన చేసి అమెరికాలో స్థిరపడి వ్యాపారం చేస్తూ ఇక్కడ స్థానికులకు సహాయం చేయాలని లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారని ఇది చాలా సంతోషకరమైన విషయం అన్నారు.


ప్రతి ఒక్కరూ హైదరాబాదులోనే వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడాలని ఉద్దేశంతో కాకుండా వరంగల్ నగరం కూడా చదువులకు కేంద్రంగా విజ్ఞానానికి నిలయంగా అనేక కళాశాలకు పుట్టినిల్లుగా నిలిచిందని ఇక్కడ ఉన్న మానవ వనరులు అమెరికా లేదా ఇతర ప్రదేశాలకు వెళ్లకుండా వారి ఇంటి వద్దనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతో ఇక్కడే చిన్న సూక్ష్మ మధ్య తరహా ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే వరంగల్ ,ఖమ్మం, కరీంనగర్ ,నిజాంబాద్ లాంటి నగరాలలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేసే వారికి పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు.


ఇక్కడ ఉన్న విమానాశ్రయ నిర్మాణం పెండింగ్లో ఉందని ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సమస్యను పరిష్కరించి విమానాశ్రయం ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనుమకొండ వరంగల్ లలో సాఫ్ట్వేర్ రంగానికి పరిమితం కాకుండా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న పరిశ్రమలు ముఖ్యంగా టెక్స్టైల్ పరిశ్రమకు సంబంధించి నా వాటిని కూడా త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు తెలిపినట్లు చెప్పారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన పాలసీని మా ప్రభుత్వం తీసుకొస్తుందని అన్నారు.

రాబోయే రోజుల్లో హైదరాబాద్ తర్వాత వరంగల్ కు ప్రాధాన్యతను ఇస్తామని ఏ విధంగా హైదరాబాదును అభివృద్ధి చేసా మో అంతకంటే మెరుగ్గా ఇక్కడ అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వపరంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని, అలాగే ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి రాక్స్ ఐటి సొల్యూషన్స్ స్థాపకులు రంజిత్ రావుల, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular