ఓరుగల్లు9నేషనల్ టీవీ :ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి త్వరగా ప్ర భుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇళ్ల నమూనాలు, లబ్దిదారుల ఎంపిక విధానంపై స్టడీ చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లపై సోలార్ విద్యుత్ ఏర్పాటు తప్పనిసరి అని.. ఆ దిశగా అధికారులు ప్లాన్ తయారు చేయాలని సూచించారు. హైదరాబాద్ లో రింగ్ రోడ్ల చుట్టూ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. త్వరగా భూసేకరణ పూర్తిచేయాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి. ఐదేళ్లలో 22.50లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి పొంగులేటి. మొదటి దశలో నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లు నిర్మించేందుకు నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టిని కోరారు మంత్రి.