Tuesday, December 24, 2024

అనుమతులు లేని ఆక్యుపెంచర్ క్లినిక్ ని తనిఖీ చేసిన వైద్యాధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. శశికళ, ఉప- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్ ఎస్.కె. సిద్ధప్ప ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది కె. మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ డీఎంఓ, హెల్త్ అసిస్టెంట్ నరసయ్యలు సోమవారం గద్వాల పట్టణంలోని భీమ్ నగర్ కాలనీలో షేక్ భాషా నిర్వహిస్తున్న
ఆక్యుపెంచర్ థెరపీ క్లినిక్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. షేక్ బాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూల్ నుంచి గద్వాలకు వచ్చి ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ క్లినిక్ నందు అన్ని రకాల వ్యాధులకు ఆక్యుపెంచర్ థెరపీ ద్వారా చికిత్స నిర్వహిస్తున్నాడని అన్నారు. ఈ ఆక్యుపెంచర్ క్లినిక్ సెంటర్, తెలంగాణ రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010, రూల్స్ -2011 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, దీంతో జిల్లా అధికారులు షేక్ బాషాని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రకారం, క్లినిక్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. లేనిచో యాక్ట్ ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా బిల్డింగ్ యజమానికి కూడా అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహించుటకు పర్మిషన్ ఇవ్వరాదని, మరోసారి ఇచ్చినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular