జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు అన్నారు. సోమవారం ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై పట్టణంలోని సిఐ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, వాహనం ఇన్సురెన్స్, పొల్యూషన్ లకు సంబంధించిన పత్రాలను ఖచ్చితంగా వెంట ఉంచుకోవాలన్నారు. వాహనాలను రాంగ్ రూట్లో నడిపి ప్రమాదాల బారిన పడొద్దని, నో పార్కింగ్ స్థలంలో వాహనాలను నిలుపొద్దని, ఆటోలలో టేపు రికార్డులు వాడొద్దని, సడన్ గా ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా రోడ్డుపై వాహనాలను ఆపొద్దని సూచించారు. వాహనంపై ఆర్సీ నెంబర్ ఖచ్చితంగా వేయించాలని, మైనర్లకు వాహనాలనుఇవ్వొద్దని, ముఖ్యంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, మద్యం సేవించి వాహనాలను నడపొద్దని అన్నారు. ఈ నిబంధనలు ఎవరు అతిక్రమించినా కొత్త చట్టాల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తమను నమ్ముకుని కుటుంబ సభ్యులు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకుని ఆటోలను సురక్షితంగా నడుపుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటోలను నడపాలని, ఆటో రిజిస్ర్టేషన్ నెంబర్ కనబడేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు-ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు-ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఎస్ఐ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES