జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా : ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బిఎం. సంతోష్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు, రైతుల నుంచి 65 ఫిర్యాదులు రాగా వాటిని కలెక్టర్ స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికై సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES