Tuesday, December 24, 2024

ప్రజా ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి-జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికై బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితుల నుంచి వచ్చిన16 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజావాణిలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్టపరంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. అలాగే బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారి పట్ల, మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. కాగా వచ్చిన 16 ఫిర్యాదులలో భూమి ఆక్రమణకు సంబంధించి-8, ఇంటిని ఇతరులు ఆక్రమించారంటు-3, పంటను ధ్వంసం చేశారని-1, ఇంటి పక్కన ప్లాట్లో మురుగు నీరు నింపడంపై 1, వడ్డేపల్లిలోని 3వ వార్డులో ప్లాట్లు వేసుకొని వేసిన వెంచర్లో వసతులు కల్పించకపోవడంపై-1, ఇతర అంశాలకు సంబంధించి -2 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular