జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులో 50శాతం రాయితీ కల్పించాలని కోరుతూ జర్నలిస్టులు శనివారం జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు క్షేత్రస్థాయిలో సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ ని కోరారు. ఇందుకు ఆయన వెంటనే స్పందిస్తూ దీనిపై జిల్లా వైద్యాధికారి ఇందిరకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50శాతం రాయితీ వర్తింపజేసే విధంగా విద్యాశాఖ నుంచి సర్క్యులర్ జారీ చేయాలని ఆయన విద్యా శాఖ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు వెంకటేశ్వర్లు గౌడ్, రాఘవేంద్ర, రాఘవ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, గోకారి,చారి తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేటు పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి-కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES