జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో *జిల్లా ఎస్పీ తోట శ్రీనివాస రావు మాట్లాడుతూ* జిల్లా పరిధిలో సామాన్యుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. మహిళలు రక్షణ కోసం, మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతామని, అలాగే దొంగతనాల నిరోధానికి మరిన్ని CC కెమేరాలు ఏర్పాటు చేయించడం తో పాటు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చొరవ తీసుకుంటానని అన్నారు. చెడు పనులను ఎవరు ప్రోత్సహించిన ఉపేక్షించేది లేదని ఎస్పీ అన్నారు. ఈ మీడియా సమావేశంలో డీ.ఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.
జిల్లాలో ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా చూస్తాంజిల్లా నూతన ఎస్పి తోట శ్రీనివాసరావు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES