జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : జిల్లాకు నూతన ఎస్పీగా వచ్చిన తోట శ్రీనివాస రావు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్పీకి జిల్లా డిఎస్పీలు సత్యనారాయణ, నరేందర్ రావు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీకి ఏఆర్ పోలీస్ అధికారులు గౌరవ వందనం సమర్పించారు. ఎస్పీ శ్రీనివాస రావు 2007 బ్యాచ్ గ్రూప్-1 అధికారిగా నియమితులై పాడేరు, జనగామలలో డిఎస్పీగా విధులు నిర్వహించారు. అలాగే నందిగామ- కృష్ణ జిల్లా, కొత్తగూడెంలలో ఓఎస్డిగా విధులు నిర్వహించారు. అదనపు ఎస్పీగా ప్రమోషన్ పొంది రాష్ట్ర ఇంటలిజెన్సీ విభాగంలో విధులు నిర్వహిస్తూనే ఎస్పీగా ప్రమోషన్ పొందారు. ఎస్పీగా రాష్ట్ర ఇంటల్జెన్సీ విభాగంలో, గవర్నర్ దగ్గర ఏడీసీగా విధులు నిర్వహించారు. అనంతరం 2013సంవత్సరంలో ఐపీఎస్ గా ప్రమోషన్ పొంది సీఐడిలో, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా విధులు నిర్వహించారు. బాలనగర్ లా, ఆర్డర్ డీసీపీగా విధులు నిర్వహిస్తూ బదిలీలో భాగంగా ప్రస్తుతం గద్వాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్పీని జిల్లాలోని ఇన్స్పెక్టర్ అధికారులు, ఎస్సైలు జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.
జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తోట శ్రీనివాస రావు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES