ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : జోగుళాంబ గద్వాల జిల్లా జర్నలిస్టుల నూతన హౌసింగ్ సొసైటీ కార్యవర్గాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మల్లికార్జున్ గౌడ్, ఉపాధ్యక్షుడుగా రాఘవేంద్ర, ప్రధాన కార్యదర్శిగా నందన్ కుమార్ తోపాటు మరో 5మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైయ్యారు. ఈ ఎన్నికలు కో ఆపరేటివ్ ఎన్నికల ఆధికారి మహేష్, యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 8మంది డైరెక్టర్లను ఎంపిక చేయగా, అందులో మల్లికార్జున్ గౌడ్, నందన్ కుమార్, రాఘవేంద్ర,లోకేష్ ఆచారి, వెంకటేష్, లక్ష్మన్, నల్లన్న, గోకారిలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. 8మంది డైరెక్టర్ల నుంచి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడి పదవులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ సందర్బంగా నూతనంగా ఏర్పడిన సొసైటీ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రధాన సమస్య అయిన ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఇతర సమస్యలపై గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులు పోరాటం చేస్తున్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం, నేతలు పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం ఏర్పడిన నూతన హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో పోరాటం చేసి జర్నలిస్టుల ఇళ్ల కల నెరవేర్చుకుందామని, అలాగే జర్నలిస్టుల సమస్యల పట్ల ముందుండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
జిల్లా జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES