ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వల్లూరు క్రాంతి జిల్లాలో పలు భూ రికార్డులలో అవకతవకలు చేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, వెంటనే వారిపై చర్యలు తీసుకునేలా కృషి చేయాలని కోరుతూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి, ఆర్డిఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారాంరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, గద్వాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్, తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గణేష్, జిల్లా అధ్యక్షులు వెంకటేష్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ఫిరోజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గత కలెక్టర్ వల్లూరు క్రాంతిపై ప్రస్తుత కలెక్టర్ కి కాంగ్రెస్ నాయకుల వినతి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES